22 June, 2026 | 3:01 AM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

22-06-2026 12:00 AM

జన్నారం, జూన్ 21: జన్నారం మండల కేంద్రంలో ఆది వారం ఘనంగా అంతర్జాతీయ యో గా దినోత్సవ వేడుకలు జరిపారు. జన్నారం పీహెచ్సీలో ఆయుష్ డిపార్ట్మెంట్, జ్యోటి గార్డెన్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. వేర్వేరు కార్యక్రమాల్లో యోగా ఇన్ స్ట్రక్టర్ రాథోడ్ స్వరూప రాణి, హెల్త్ అసిస్టెంట్ పోచయ్య, పీహెచ్సీ స్టాఫ్ నర్సు విజయలక్ష్మి, ఆశా వర్కర్లు కవిత, భూమక్క, శైలజ, సువర్ణ, రాజేశ్వరి, బీజేపీ మండల అధ్యక్షులు మధుసూదన్ రావు, ఉపాధ్యక్షులు అప్పాల జలపతి, నాయకులు రమేష్ గౌడ్, బద్రి నాయక్ తో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.