యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు
22-06-2026 12:00 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, జూన్ 21,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల అవగాహన వారో త్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వి ద్యార్థులు ఇతరులను కూడా అప్రమత్తం చే యాలని ఎస్పీ సూచించారు. జిల్లా వ్యా ప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో యోగా కా ర్యక్రమాలతో పాటు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






