21-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 20 (విజయక్రాంతి) : 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా యోగ తో మీ జీవితాన్ని మార్చుకోండి అనే నినాదంతో శుక్రవారం ఉదయం మంచిర్యాల ఐబీలో యోగ వేడుకలు నిర్వహించారు. బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ గురువులు, యోగ సాధకులు, పుర ప్రముఖులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్లో : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శని వారం జిల్లాలో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా ప్రధా న న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. వి. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, ప్రతిరోజు యోగ కొరకు కొంత సమ యం కేటాయించుకోవాలని, ఆరోగ్యా న్ని పెంపొందించుకోవాలని తెలిపారు. జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేసే దిశగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు.