పారమితలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని పారమిత విద్యాసంస్థ(Paramita Educational Institution)లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకుని శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి యోగాసనాలు వేసారు. విద్యార్థులచే ప్రదర్శించబడిన యోగాసనాలు, యోగా ప్రాముఖ్యతని తెలిపి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనూకర్ రావు, ప్రసూన, రశ్మిత, టి.యస్.వి.రమణ, వినోద్ రావు, వి.యు.యం.ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, కవితాప్రసాద్, సమన్వయకర్తలు, యోగా శిక్షకుడు రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






