27 June, 2026 | 5:48 PM

అంతరరాష్ట్ర కబడ్డీ, చెస్ టోర్నమెంట్

14-06-2024 12:52 AM

సూర్యాపేట,జూన్ 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం టీజీట్రాన్స్‌కో, డిస్కమ్ ఉద్యోగుల అంతరరాష్ట్ర కబడ్డీ, చెస్ టోర్నమెంట్ 2024 సూర్యాపేట విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్.పాల్‌రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్‌రాజ్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. కబడ్డీ 11 సర్కిళ్లు, చెస్ 16 టీమ్‌లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ ట్రాన్స్ కో డానియల్, డీఈ ఆపరేషన్ సూర్యాపేట శ్రీనివాస్, హుజూర్‌నగర్ డీఈ వెంకట కిష్టయ్య, స్పోర్ట్స్ ఆఫీసర్లు జగన్, శ్రీనివాస్, సూర్యాపేట టౌన్ ఎఈ సురేష్ పాల్గొన్నారు.