3 July, 2026 | 11:55 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

హెచ్‌సీఏలో అవకతవకలపై విచారణ చేయండి

24-09-2024 02:09 AM

విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ చామల ఫిర్యాదు 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన విజిలెన్స్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్‌తో సంప్రదింపులు లేకుండానే కొంత మంది చేతుల్లోనే నిర్ణయాధికారాలు ఉన్నాయన్నారు. క్యారింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియ వివాదం జరుగుతోందన్నారు. హెచ్‌సీఏ రోజువారి వ్యవహారాలపై రెగ్యులర్ అప్‌డేట్‌లను సీఈవో అందించడం లేదన్నారు. మీటింగ్ మినిట్స్ సర్క్యూలేట్ చేయడం లేదని, ఆర్థిక అక్రమాలు, ఆడిటర్ సిఫార్సులు ఇవ్వడం లేదన్నారు.