22 July, 2026 | 2:02 AM

నాచారం శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ కార్యక్రమం

22-07-2026 12:00 AM

ఉప్పల్, జూలై 21 (విజయక్రాంతి) : శ్రీ చైతన్య స్కూల్, నాచారంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత భావనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం శ్రీ మహమ్మద్ అలీ నూర్, డీన్ శ్రీ రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపల్స్ డా. షారోన్, శ్రీ వెంకట్ నరసయ్య, అకాడెమిక్ కోఆర్డినేటర్లు శ్రీ పుల్లారావు, శ్రీ రవి, ఇతర ఇన్చార్జ్లు, అలాగే నాచారం ఎస్‌ఐ ఎస్కే మైబెల్లి మరియు డబ్ల్యూఎస్‌ఐ రాజని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మై బల్లి మాట్లాడుతూ  నూతనంగా ఎన్నికైన స్టూడెంట్ క్యాబినెట్ సభ్యులను అభినందించినరు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం ద్వారా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను అలవర్చుకుని, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను గౌరవిస్తూ ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, స్పోరట్స్ కెప్టెన్లు మరియు ఇతర స్టూడెంట్ క్యాబినెట్ సభ్యులకు బ్యాడ్జీలు, గుర్తింపు చిహ్నాలు అందజేసి వారి బాధ్యతలను అధికారికంగా అప్పగించారు. విద్యార్థులు తమ నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.