గ్రామీణ విద్యార్థులకు ఐఓసీఎల్ సేవలు అమోఘం
16-07-2026 01:34 AM
ఎంపీ చామల
ఆలేరు, జూలై 15 : భువనగిరిలోని కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఐఓసీఎల్, నిర్మాణ్ సంస్థల ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ. 3.65 కోట్లతో జిల్లాలోని కేజీబీవీ మోడల్ స్కూళ్లలో ఐ-స్పార్క్ ల్యాబ్ లు, బంకర్ బెడ్స్, సోలార్ ఫెన్సింగ్ వంటి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామీణ వి ద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.






