సీఏ అమృత్ కుమార్ కోటకు ఐపీఏ ప్రొఫిషియెన్సీ అవార్డు
సన్మానించిన తెలంగాణ లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సీఏ అమృత్ కుమార్ కోటకు చార్టెడ్ అకౌంటెంట్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఐపీఏ సన్మాన్ ప్రొఫిషి యెన్సీ అవార్డు2026 లభించింది. హైదరాబాద్ రెడ్హిల్స్ లక్డీకాపూల్లోని ఎఫ్ టిసీసీఐ భవనంలోని కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఐపీఏ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఐపీఏ సన్మాన్ అవారడ్స్ కార్యక్రమంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అమృత్ కుమార్ కోట అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఐపీఏ సన్మాన్ అ వార్డ్స్ నిర్వాహకులు జె.వి.రావు, డి.బి. ప్రకా శ్, తెలంగాణ, ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ దహిమా, మాజీ అధ్య క్షులు సీఏ చంద్రశేఖర్ వేముల, ఐటీపీ బొజ్జ మధుసూదన్, కార్యదర్శి సీఏ నారాయణరా వు తదితరులు అభినందించారు.






