10 August, 2026 | 3:49 AM

అమ్మవారి ఆలయాలను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్

10-08-2026 12:00 AM

సికింద్రాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆషాఢం బోనాల పండుగ సందర్భంగా ఓల్ బోయిన్ పల్లి, హస్మత్ పేట్ డివిజన్లలోని పలు అమ్మవారి ఆలయాలను మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులతో కలిసి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని, భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆషాఢ బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు.