9 July, 2026 | 6:39 PM

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు

09-07-2026 05:41 PM

సుల్తానాబాద్, జులై 9 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన అండర్-17 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపీఎస్) విద్యార్థులు డి ప్రియదర్శిని, వై సమన్విత, బి మణికంఠ మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నట్లు కోచ్ బొల్లి సత్యనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ ఎంపికైన విద్యార్థులను గురువారం అభినందించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని, రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఐపీఎస్ ఎప్పుడూముందుంటుందనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సునీత,పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, సతీష్, జ్యోతి పాల్గొని విద్యార్థులను అభినందించారు.