9 July, 2026 | 6:18 PM

కోదాడలో ఆర్థో ట్రామా కేర్ ప్రారంభం..అత్యవసర వైద్యం ఇక మరింత చేరువ

09-07-2026 05:43 PM

మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు 

కోదాడ జూలై 09 (విజయక్రాంతి): పట్టణంలోని రేపాల పూర్ణచంద్రరావు వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థో ట్రామా కేర్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కోదాడతో పాటు పరిసర ప్రాంతాల్లో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో ఎముకలు, కీళ్లు, కండరాలు, నరాలకు తీవ్ర గాయాలయ్యే బాధితులకు సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ ట్రామా కేర్ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలతో పాటు పొరుగు జిల్లాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మల్లేశ్వరి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ దుస్సా వంశీ, ముదిరాజ్ సంఘం కన్వీనర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బోళ్ళ కరుణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కరరావు, తమరబోయిన వీరబాబు, టీ. రామయ్య, బొల్లపల్లి రామయ్య, ఎస్‌ఐ మూసి వెంకయ్య, మూసి మట్టయ్య పాల్గొన్నారు.