4 June, 2026 | 1:36 AM

ఆన్‌లైన్ బెట్టింగ్‌లు చట్ట విరుద్ధం

04-06-2026 12:00 AM
  1. రాజ్యాంగ రక్షణ ఉండదు
  2. తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాలు సమర్థనీయం
  3. సుప్రీంకోర్టు కీలక తీర్పు
  4. ‘జంగ్లీ గేమ్స్’ కంపెనీల పిటిషన్లు తిరస్కరణ    

ఢిలీ, జూన్ 3 (విజయక్రాంతి): ఆన్‌లైన్ గేమ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నైపుణ్యంతో కూడిన ఆట లు అయినప్పటికీ రాజ్యాంగ రక్షణ ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. వివిధ ఆన్‌లైన్ క్రీడలపై తమిళనాడు, కర్ణాటక ప్ర భుత్వాలు చేసిన చట్టాలను సమర్థించింది. ఆన్‌లైన్ జాదాలను నిషేధించే పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉంటుందని జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూ డిన ధర్మాసనం వెల్లడించింది.

గతంలో ఈ చట్టాలను కొట్టివేస్తూ మద్రాస్, కర్ణాటక హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసం రద్దు చేసింది. ఆన్‌లైన్ రమ్మీ, ఫోకర్ లేదా ఫాంటసీ స్పోర్ట్స్ ఆడటానికి నైపుణ్యం అవసరమైనా.. వాటిపై డబ్బులతో పందేలు కాస్తే అది ‘జూదం’ కిందికే వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(g)కింద ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా వ్యా పారం చేసుకునే ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని, ఇవి సమాజానికి హానికరమైనవిగా పేర్కొంది.

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాల వల్ల యువత ఆర్థిక నష్టాలపాలై మానసిక ఒత్తిడికి లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి తీవ్ర సామాజిక సమస్యలను కోర్టు ప్రస్తావించింది. సమాజహితం, శాంతిభద్రతల దృష్ట్యా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, రియల్ మనీ గేమింగ్ చట్ట విరుద్ధమని తెలిపింది. జంగ్లీ గేమ్స్ వంటి పెద్ద కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషే ధం విధించటానికి మార్గం సుగమమైంది. అంతకాకుండా, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28 శాతం జీఎస్‌టీని కూడా కోర్టు సమర్థించింది.