16 April, 2026 | 2:00 AM

బిచ్కుంద మున్సిపాలిటీలో అక్రమాలు

16-04-2026 12:29 AM

గత కమిషనర్ తీరుపై పాలకవర్గ సభ్యుల ఆగ్రహం

అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిందే

మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేసిన పాలకవర్గ సభ్యులు

బిచ్కుంద, ఏప్రిల్ 15 ( విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని వాటిపై విచారణ జరపాలని నూతన పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సీమా రమేష్ షెట్కార్ ఆధ్వర్యంలో తొలి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా వేసవి దృష్టిలో త్రాగునీటి సరఫరా మొదలుకొని మురికి కాలువల నిర్వహణ, ఆ యా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వర పరిష్కారం కోసం తీసుకుని యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని, అవినీతి అక్రమాలపై చర్య లు తీసుకోవాలని పలు తీర్మానాలు చేశారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణాల వేగవంతం చేయాలని అర్హులైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాల కోసం ఆసక్తి చూపేవారిని గుర్తించి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ మున్సిపల్ తొలగి వంశీ కార్యక్రమంలో చైర్మన్ సిమా రమేష్ షెట్కార్ తోపాటు వైస్ చైర్మన్ పడిగేల భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ కౌన్సిలర్లు  ధర్పల్లి కార్తీక సంతోష్ చిన్న మారుతి, ధర్పల్లి గంగాధర్, లతోపాటు పలువురు వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తుల శ్రీనివాస్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ హయాంలో తాత్కాలిక పనిచేస్తున్నటువంటి గతంలోని గ్రామపంచాయతీ ద్వారా కారోబారి రూపంలో అవతారం ఎత్తిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినటువంటి స్థానికేతర వ్యక్తి మున్సిపల్ కు చెందిన వ్యాపార స్థలాల అద్దె బకాయిల వసూళ్లలో సెటిల్మెంట్ల రూపంలో పెద్ద ఎత్తు న గతంలోని గ్రామపంచాయతీ  రసీదు పుస్తకాల ద్వారా వసూళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు సాగించి వచ్చిన వసూళ్లను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా గతంలో ఎల్ ఆర్ ఎస్ రూపంలో మున్సిపాలిటీ పరిధిలో క్రమబద్ధీకరణకు నోచుకోని నివాసస్థలాల రికార్డుల్లో పొందుపరచడం మాటున అక్రమాలు సాగించినట్టు వారసత్వపు ఆస్తి మార్పిడి ప్రక్రియల్లోనూ పలు అక్రమాలకు పాల్పడి పలువురి వద్దనుండి ముడుపులు తీసుకుని ముఖం చాటేస్తూ దాటవేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటి మున్సిపల్ కమిషనర్ మొదలుకొని చైర్మన్ పాలకవర్గ సభ్యులు ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. అవినీతి ఆక్రమాలపై నిగ్గు తేల్చాలని పాలకవర్గ సభ్యులు తీర్మానించారు.