calender_icon.png 20 July, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక మాంద్యం అమెరికాకూ తప్పదా?

10-04-2025 12:00:00 AM

అమెరికా మరొకసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎక్కడ చూసినా ఆ దేశమే చర్చల్లో ఉంటోంది. అత్యంత ఎక్కువగా దాదాపు 45 లక్షలమంది ప్రవాస భారతీయలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే సంచలనాలకు తెర లేపారు. భారత్‌సహా ఇతర ప్రపంచ దేశాలకు సం బంధించిన ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు ప్రకటించారు. వివిధ దేశాలు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని దేశాలైతే ఒకడుగు ముందుకేసి మరీ అమెరికా ఉత్పత్తులపైనా తాము సుంకాలు విధి స్తామని ప్రకటించాయి. ఈ పరిణామాల దృష్ట్యా అమెరికాలో సమీప భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వే స్తున్నారు.

మూడు శాతం ఉన్న ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికే దిగజారింది. దీని ప్రభా వంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగ రేటు పెరుగుతుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికైతే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదు. కానీ కొత్త సుంకా లు, వాణిజ్య యుద్ధం మార్కెట్లను అస్థిర పరిచాయి. మాంద్యం భయాలను పెంచా యి. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆర్థిక మాం ద్యం సాధ్యమే అన్నారు. 2024లో అమెరికా వాస్తవ జీడీపీ 2.4 శాతంగా నమో దైంది. కరోనా సమయంలో వృద్ధిరేటు పడిపోయినా స్థిరమైన వృద్ధి నమోదైంది. 

వేతనాల వృద్ధిలో తగ్గుదల

2021 డిసెంబర్ నుంచి అమెరికాలో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. 3.4 నుంచి 3.9 శాతం మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. ఈ వసంతకాలంలో వృద్ధిరేటు పెరగడం ప్రారంభమైంది. ఈ క్రమంలో మే నుంచి 4 శాతాన్ని అధిగమించింది. అలాగే, గత ఫిబ్రవరిలో వేతన వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదైంది. 2023లో ఇదే సమయంలో ఉన్న వేతన వృద్ధితో పోల్చితే వేతన వృద్ధి తగ్గుతున్నట్టు తెలుస్తున్నది. ‘ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా’ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం వార్షిక వృద్ధి 2020లో కంటే చాలా వేగంగా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. ద్రవోల్బణం వార్షిక ప్రాతిపదికన ధరల పెరుగుదల రేటును కొలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్ 2 శాతం ద్రవ్యోల్బణ రేటును లక్ష్యంగా పెట్టుకుంది.

ద్రవ్యోల్బణ రేటు సాధారణంగా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ద్వారా నెలవారీగా విడుదలయ్యే వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)కు ప్రతిబింబంగా ఉంటుంది. ఫిబ్రవరి నాటికి ప్రధాన సీపీఐ 3.2 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి కోర్ పర్సనల్ వియోగతా వ్యయం సూచీని ఫెడరల్ రిజర్వ్ ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని నడిపించే ముఖ్యమైన అంశాల్లో అద్దె ఖర్చులు ఒకటి. దీనికి కారణం అద్దె షెల్టర్ ధర సూచీలో చేర్చి ఉండటమే. షెల్టర్ సీపీఐలో అతిపెద్ద విభాగాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలో సీపీఐలో అద్దె భాగం దశాబ్దాలుగా మొత్తం ద్రవ్యోల్బణాన్ని అధిగ మించింది. హౌసింగ్ వెబ్‌సైట్ వంటి అద్దె ధరలను ట్రాక్ చేసే కంపెనీలు.. అద్దె పెరుగుదల దాదాపు ఏడాదిపాటు మందగిం చినట్లు చూపిస్తున్నాయి. అయితే, ఈ మందగమనం ఇంకా సీపీఐ నివేదికల్లో కనిపించడం లేదు. 

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఫలితాలు

అమెరికా సంయుక్త రాష్ట్రాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం, సోషలిజం అనే భావనలు కనిపిస్తాయి. మిశ్ర మ ఆర్థిక వ్యవస్థ కొంతవరకు ప్రైవేటు ఆస్తి ని రక్షిణిస్తుంది. అలాగే, మూలధన వినియోగంలో ఆర్థిక స్వేచ్ఛను అనుమతిస్తుంది. ఇదే సమయంలో ప్రజాక్షేమం కో సం సామాజిక లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వాలు తీసుకునే చర్యల్లో కూడా జోక్యం చేసుకుంటాయి. ఇది స్వేచ్ఛా మార్కెట్‌ను స్వీకరిస్తుంది. విద్య, రోడ్లు, ఆసుపత్రి సంరక్షణ, పోస్టల్ డెలివరీ వంటి రంగాల్లో పరిమితులు ఉంటాయి. లైసెన్సింగ్ అవసరాలతో ప్రభుత్వం ఆర్థిక వ్యవ స్థలో కొంత భాగాన్ని నియంత్రిస్తుంది. తీవ్ర పేదరిక ప్రభావాలను తగ్గించడానికి సమాఖ్య ప్రభుత్వం పరిమిత సంక్షేమ రాజ్యాన్ని అందిస్తుంది.

అమెరికా ప్రభుత్వానిది దేశ ఆర్థిక వ్యవహారాల్లో ఎల్లప్పుడూ క్రియాశీలమైన కీలక పాత్రే. దీనిద్వారా దేశంలో అనేక సేవలు ప్రభుత్వరంగ నియంత్రణలోకి రావడం ప్రారంభించాయి. అమెరికా ప్రస్తుతం అ త్యంత అభివృద్ధి చెందిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. పర్చేసింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా 2024 నాటికి ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యధిక తలసరి జీడీపీని కలిగి ఉంది. 2023 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూఎస్ 26 శాతం వాటాను కలిగి ఉంది. అదే సమయంలో పీపీపీ పరంగా 15.5 శాతం వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ లావాదేవీల్లో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ యూఎస్ డాలర్. అనేక దేశాలు దీన్నే ప్రామాణిక కరెన్సీగా ఉపయోగిస్తాయి. అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన  తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా స్థిరమైన వృద్ధిని, తక్కువ నిరుద్యోగంతో వేగవంతమైన పురోగతిని సాధించింది. 

ఆర్థిక ప్రగతిలో మందగమనం

ట్రంప్ తాజాగా తీసుకున్న చర్యలద్వారా సానుకూలతలు రాకముందే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. అధిక సుంకాలు, సమాఖ్య శ్రామిక శక్తి తొలగింపు వంటి చర్యలు అంచనా వేసిన దానికంటే ముందుగానే వృద్ధికి అంతరాయం కలిగించే ప్రమాదమూ ఉంది. ఫలితంగా గ్లోబల్ రేటింగ్స్ సంస్థ వాస్తవ జీడీపీ వృద్ధి 2025, 2026ల్లో 1.9% శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది 2023, 2024 సంవత్సరాల వృద్ధి రేటుతో పోల్చితే చాలా తక్కువ. నాల్గవ త్రైమాసికంలో తాము వాస్తవ జీడీపీ వృద్ధిని సుమారు 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు గ్లోబల్ రేటింగ్స్ సంస్థ వెల్లడించింది. 2026 సంవత్సరం ప్రారంభమైన తర్వాత వృద్ధి నెమ్మదిగా పుంజుకోవచ్చనీ అంచనా వేసింది.

సుంకాల నిర్మాణం తగ్గడం, ఫెడరల్ రిజర్వ్ తన పాలసీ రేటును మరింత తగ్గించడం, యూరో జోన్లో మరింత అనుకూలమైన వృద్ధి వంటివాటిని తమ అంచనాకు ప్రధాన కారణాలని తెలిపింది. 2025 ప్రారంభంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కొంతమేర తన ఊపును కోల్పోయినట్లు వెల్లడించింది. బలహీన గృహ ఆదాయ వృద్ధి, ప్రభుత్వం నుంచి తగ్గిన సానుకూల ప్రేరణలు, పెరుగుతున్న సుంకాలు, అధిక వడ్డీ రేట్లు, దీర్ఘకాలిక విధాన అనిశ్చితి ఈ ఏడాది ఆర్థిక వృద్ధి మందగమనానికి ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. 

వృద్ధి మందగించడం వల్ల 2025 మ ధ్య నాటికి నెలకు లక్ష ఉద్యోగాలకంటే త క్కువ చొప్పున ఉద్యోగాల పెరుగుదల రే టు తగ్గనుంది. ఫిబ్రవరిలో ఉద్యోగాల పె రుగుదల రేటులో తగ్గుదల మూడు నెలల సగటు కంటే తక్కువగా నమోదైంది. అలా గే, వలసలలో భారీ స్థాయిలో తగ్గుదల సరఫరా ఆధారిత జీతాల వృద్ధిలో మందగమనానికి దారి తీయవచ్చు. ఈ క్రమం లోనే నిరుద్యోగ రేటు 2026 మధ్య నాటికి 4.6 శాతానికి తగ్గుతుందని అంచ నా. ట్రంప్ ప్రభుత్వం వేలాదిమంది ఫెడరల్ ఉద్యోగులమీద వేటు వేయాలని భావిస్తున్నది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్ తర్వాత నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అం చనా వేస్తున్నారు. ట్రంప్ చర్యల ఫలితంగా ఇప్పటికే అమెరికాలో నిరసనలు మొదలైనాయి. భవిష్యత్తులో అమెరికా ఆర్థిక పరిస్థి తులు మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉన్నందున ఆందోళనలు మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.

-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి