03-06-2025 12:00:00 AM
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడూ ప్ర ధాన చర్చనీయాంశమే. దశాబ్దాలుగా వారి ప్రభావం అపారం. అయితే, ఇప్పుడు అదే కుటుంబంలో, అదే పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త, తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీ ఆర్)పై పరోక్షంగా, కానీ అత్యంత ఘాటు గా సంధించిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణు ల్లో అలజడిని రేపుతున్నాయి.
ఈ పరిణామాలు కేవలం కుటుంబ కలహాలా లేక పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తన రాజకీయ ప్రయోజనాల కోసం నడిపిస్తున్న ఒక పెద్ద డ్రామానా అనే అనుమా నాలనూ లేవనెత్తుతున్నాయి. కేసీఆర్ తన లక్ష్యాల కోసం ఎంతటి వ్యూహానికైనా దిగుతారనే విమర్శలున్న నేపథ్యంలో, కవిత ఎపిసోడ్ కూడా అలాంటి ఒక వ్యూహాత్మక అడుగు కావచ్చు అనిపిస్తున్నది.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలి స్తే, ఆయన ఒక పెద్ద వ్యూహకర్త అని స్పష్టమవుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని నడి పించిన తీరు, ప్రత్యేక రాష్ట్రసాధన, తర్వాత రెండుసార్లు అధికారంలోకి రావడం, ప్రతిపక్షాలను బలహీనం చేయడం.. ఇవన్నీ ఆయన రాజకీయ చాతుర్యాన్ని తెలియజేస్తాయి. సందర్భానుసారం తన స్టాండ్‌ను మార్చుకోవడం, ప్రత్యర్థులను గందరగోళంలో పడేయడం, ప్రజల సానుభూతిని పొందడం వంటి వ్యూహాలను ఆయన ఎన్నోసార్లు ప్రయోగించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన నేపథ్యంలో, పార్టీకి ఒక కొత్త ఊపు ఇవ్వడం, ప్రజల దృష్టిని ఆకర్షించడం, పాత నాయకులను పక్కకు నెట్టి కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడం కేసీఆర్‌కు అవసరం. కవిత ఎపిసోడ్ ఈ అవసరాలను తీర్చడానికి ఒక అస్త్రంగా ఉపయోగ పడతారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఎన్నో సందేహాలు, ఒక్కటే సమాధానం!
‘కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దె య్యాలున్నాయి’ అనే కవిత వ్యాఖ్యలు, ‘బీజేపీని అవసరమైనంత విమర్శించలేదు’ అంటూ సొంత పార్టీని ఘాటుగా విమర్శించడం.. ఇవి కవిత కేవలం ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు కాకపోవచ్చు. ఇవి ఒక ప్రణాళికలో భాగంగానే లీక్ అయి ఉండవచ్చు. కే సీఆర్ వంటి వ్యూహకర్తకు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఒక కుటుం బ సభ్యురాలు, కీలక నాయకురాలు ఇ లాంటి లేఖ రాయడం, అది లీక్ కావడం అసాధ్యం కావచ్చు.
ఈ లేఖ ద్వారా పార్టీ లో ఉన్న అంతర్గత సమస్యలను పరోక్షం గా అంగీకరించడంతోపాటు ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని పొందవచ్చు. బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ఉన్నాయని అంగీకరించడం ద్వారా పార్టీపట్ల ఒక సానుకూల దృక్పథాన్ని సృష్టించవచ్చు. అలాగే, కేటీఆర్పట్ల పార్టీలో, ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను ఉపయోగించుకొని కవితద్వారా విమర్శలు చేయించి, భవిష్యత్ రాజకీయాలకు ఒక కొత్త మార్గాన్ని సుగ మం చేసుకోవడమూ అయి వుండవచ్చు. పార్టీలో కేటీఆర్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును తిరిగి బలోపేతం చేసుకోవడం ఈ రకంగా సాధ్యం కావచ్చు.
కవిత లేఖ, తదనంతర పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కేవలం బీఆర్ఎస్ గురించే చర్చ జరిగేలా చేస్తాయి. ఇది ప్రతిపక్షాలను పక్కనపెట్టి, బీఆర్ఎస్నే వార్తల్లో నిలబెట్టే వ్యూహమూ కావచ్చు. తద్వారా పార్టీకి ఉచిత ప్రచారం కల్పించుకున్నట్లు అవుతుంది. కవిత కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని అనడం, కేటీఆర్ పార్టీలో కోవర్టులు ఉండొచ్చు అనడం.. ఈ మాటలు కూడా ఒక స్క్రిప్ట్‌లో భాగమే అయితే, దాని వెనుక కేసీఆర్ ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న.
స్వచ్ఛంద యుద్ధం వెనుక!
కవిత తన సొంత సంస్థ జాగృతి తరపున ‘సింగరేణి జాగృతి’ని ప్రారంభిం చడం, సింగరేణిలో ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఉన్నప్పటికీ, ఇది కేసీఆర్ వ్యూహంలో ఒక భాగం కావచ్చని కూ డా పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కవితకు సొంత వేదిక కల్పించడంగా దీనిని చూస్తున్నారు. పార్టీలో తన స్థానం పట్ల అసంతృప్తిగా ఉన్న కవితకు ఒక ప్రత్యామ్నాయ వేదికను సృష్టించినట్టయ్యింది. దీనిద్వారా ఆమె తన శక్తిని పార్టీలోనే కేం ద్రీకరించకుండా, వేరే అంశాలపై దృష్టి సా రించేలా చేసినట్లవుతుంది. ఆమెను పార్టీ లో ఒక ప్రత్యేక గుర్తింపుతో నిలబెట్టే ప్రయత్నంగానూ దీనిని అర్థం చేసుకోవచ్చునని వారంటున్నారు.
సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయిన నేపథ్యంలో, కవితద్వారా మ ళ్ళీ ఆ ప్రాంతంలో పట్టు సాధించడానికి ప్రయత్నించడంగానూ దీనిని పలువురు భావిస్తున్నారు. ఇది రాబోయే స్థానిక ఎన్నికలకు, 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఒక దీర్ఘ కాలిక వ్యూహంలో భాగమై ఉండవచ్చు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని వస్తున్న విమర్శలను తగ్గించడానికి, కవితను స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు చూపించడానికి ఈ కోణం ఉపయోగపడుతుంది.
ఇది పార్టీకి ప్రజాస్వామ్య స్వభావాన్ని ఆపాదిస్తుంది కూడా. ఏదేమైనా, అన్నాచెల్లెళ్ల యుద్ధం కేసీఆర్ నియంత్రణలోని ఒక నాటకమై ఉండవచ్చునన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతు న్నాయి. అధికారాన్ని కేసీఆర్ తన చేతుల్లోనే ఉంచుకోవడంగా కూడా పై పరిణా మాలను అర్థం చేసుకోవచ్చు. తన తర్వాత ఎవరు అనే చర్చను పక్కకునెట్టి తానే పార్టీకి తిరుగులేని అధినేత అని నిరూపించుకోవడంగా దీనిని చూడవచ్చు. నాయక త్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఈ రకంగా తెరదించినట్టవుతుంది.
పార్టీలో ఇతర నాయకులను బలహీనపరచడం కూడా ఇందులో భాగం కావ చ్చు. అన్నాచెల్లెళ్ల మధ్య వివాదంపై దృష్టి సారించడం ద్వారా పార్టీలోని ఇతర కీలక నాయకుల ప్రాధాన్యాన్ని తగ్గించినట్టు అవుతుంది. పార్టీలో చీలికలు లేకుండా, కేసీఆర్ తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించగలుగుతారు.
అధికార సాధన అసలు లక్ష్యమా?
కుటుంబంలోనే కలహాలు వచ్చినా, పార్టీ ప్రయోజనాల కోసం తానే ముం దుండి పోరాడుతున్నానని చూపించుకోవడానికి కూడా కేసీఆర్‌కు ఇది ఉపయోగప డగలదు. ఇది ఒక విక్టిమ్ కార్డ్ ఆడటం ద్వా రా ప్రజలనుంచి సానుభూతిని పొందడానికి ప్రయత్నం అయి ఉండవచ్చు కూడా.
కేసీఆర్ తన కుమార్తె కవితపై చర్యలు తీసుకోక పోవడం, కేవలం చిట్ చాట్‌లో మాట్లాడిన వాటిపై షోకాజ్ ఇవ్వలేం క దా? అని బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌రావు వంటివారు అనడం కూడా ఈ సందర్భంగా ఇక్కడ గమనార్హం. ఈటల రాజేందర్, ఆలె నరేంద్ర, విజయశాంతి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్న కేసీఆర్, తన కూతురు విషయంలో వేచి చూ సే ధోరణి చూపిస్తే, అది ‘కుటుంబ పార్టీ’ ముద్రకు మరింత బలం చేకూరుస్తుంది.
అయినా, ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ మొ త్తం ఎపిసోడ్ పార్టీలో కొంత అలజడిని సృష్టించినా, దీర్ఘకాలంలో బీఆర్ఎస్కు ప్ర యోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే జరుగుతుందనీ వారు భావిస్తున్నారు.
కవిత పార్టీనుంచి బయటకు రావడం ఖాయమన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ మె సొంత పార్టీ పెడతారా? వేరే పార్టీలో చేరతారా? అనేది ఇంకా స్పష్టత లేదు. ఆమె బయటకు వెళితే బీఆర్ఎస్కు నష్టం లేదు. ఆమెకు పెద్దగా లాభం జరిగే పొలిటికల్ బేస్ కాని, పర్సనల్ బేస్ కాని లేదు. కానీ డిస్ట్రబెన్స్ జరుగుతుంది. కాకపోతే, కేసీఆర్ అథారిటీ నైతికంగా పట్టు తగ్గుతుంది. ‘మీ పిల్లలే మీ మాట వినలేదు’ అన్న విమర్శలు వస్తాయి.
అయితే, ఈ డిస్ట్రబెన్స్ కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమే అయి వుండవచ్చు. బీఆర్ఎస్కు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, రాజకీయ ప్రత్యర్థులను గందరగోళంలో పడేయడానికి ఈ పరిణామాలన్నీ ఉపయోగపడతా యేమో. కవిత తిరుగుబాటు, ఆ తర్వాత ఆమె పార్టీనుంచి బయటకు వెళ్లడం (ఒకవేళ జరిగితే) కేసీఆర్ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇది బీఆర్ఎస్కు 2029 ఎన్ని కలకు సిద్ధం చేసే ఒక వ్యూహాత్మక అడుగు కావచ్చని వారు భావిస్తున్నారు. ఈ వ్యూ హమంతా బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకు రావడానికి, కేసీఆర్ నాయ కత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశితమై కనిపిస్తున్నది. ఇది ఎంతవరకు నిజమనేది కాలమే తేల్చి చెబుతుంది.
వ్యాసకర్త సెల్ : 9912178129