calender_icon.png 25 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలహీన శిలాజపొరలే కారణమా?

05-12-2024 01:47:03 AM

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతంలో భూకంపం రావడంపై స్వరత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. భూకంపం రావడా నికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రాంతం గ్రానైటిక్ టెర్రయిన్ ప్రాంతం.

సెడిమెంటరీ రాక్స్ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో ఉండే శిలాజ పొరలు బలహీనంగా ఉంటాయి. భూకంపం వచ్చిన ములుగు ప్రాంతంలోని భూమి అంతర్భాగంలో కూడా ఈవిధమైన సెడిమెంటరీ రాక్స్ వంటి బలహీన శిలాజ పొరలే ఉన్నా యి. దీని కారణంగా భూమిలో కదలికలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో భూమిలో రాతి నిర్మాణాల్లో అప్పుడప్పుడు కదలికలు తలెత్తే అవకాశం ఉంటుంది.

దీంతోపాటు భూమి తన చుట్టూ తాను తిరిగి భ్రమణ సమయంలోనూ ఈ రకమైన కదలికలు వస్తాయి. సీజిమిక్ వేవ్స్‌గా పిలిచే భూమి అంతర్భాగం లోని రాతి పొరలు ఢీకొనడం వల్లన శక్తి వెలువడుతుంది. ఈ కారణంగా కూడా భూకంపం వచ్చేఅవకాశం ఉన్నది. గనులు, తవ్వకాలు చేపట్టే ప్రాంతాలు, న్యూక్లియర్ పరీక్షలు జరిగే ప్రాంతాల్లో కూడా భూమిలో కదలిక సాధారణంగా వస్తాయని, కానీ భూ కంపానికి పూర్తిస్థాయిలో వాటి వలనే జరిగిందని చెప్పలేమని నిపుణులు వెల్లడిస్తు న్నారు. మైనింగ్, న్యూక్లియర్ పరీక్షల వలన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చంటున్నారు.

మేడారం కేంద్రంగా

భూకంపం అటవీ ప్రాంతంలో రావడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఆ స్థాయిలో నగర ప్రాంతంలోనో, పట్టణ ప్రాంతంలోనో వస్తే నష్టం జరిగే అవకాశం ఉండేది. మేడా రం కేంద్రంగా వచ్చిన భూకంపం తీవ్రత దూరం పెరుగుతున్న కొద్దీ తగ్గింది. ఈ భూకంపం తీవ్రత దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దీంతో ములు గు ప్రాంతంతో పోల్చితే ఇతర దూర ప్రాంతాల్లో కాస్త తగ్గే ఛాన్స్ ఉంటుంది. 

1969లోనూ ఇలాగే.. 

తెలంగాణ ప్రాంతంలో, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనూ ఇప్పటికే పలుమార్లు భూకంపం వచ్చినప్పటికీ ఈ స్థాయిలో గతంలో ఒక్కసారి మాత్రమే నమోదైంది. భద్రాచలం ప్రాంతంలో 1969 జూలై 5న అతి ఎక్కువ తీవ్రతతో భూకంపం నమోదైంది. అది రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదు అయింది. బుధవారం 5.౩గా నమోదైంది. 1983లో మేడ్చల్ వద్ద 4.8 రిక్టర్ స్కేల్‌పై తీవ్రత నమోదైంది. 

భయపడాల్సిన పనిలేదు 

ప్రస్తుతం వచ్చిన భూకంపంతో భయపడాల్సిన పనిలేదు. వాస్తవానికి జోన్‌గీ జాబితాలోని ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి. జోన్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు సర్వసాధారణం. అందుకే హిమాలయ కొండ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తుంటాయి. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత కంటే తక్కువగా ఉంటే ప్రమాదమేమీ ఉండదు. ఇప్పుడు 5.3 తీవ్రత నమోదైనప్పటికీ అది అటవీ ప్రాంతం కావడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం 5.3 తీవ్రత ఉండటంతో పరిధి 250 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అదే తీవ్రత 6 దాటితే పరిధి 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఉండేది. అప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుంది. 

 గుండా, సీనియర్ సైంటిస్టు, జీఎస్‌ఐ, హైదరాబాద్