10 March, 2026 | 1:54 AM

మీడియాలో ప్రకటనలు ఇస్తే రాద్దాంతమా?

07-03-2026 12:19 AM
  1. ప్రకటనల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసింది మీరే

హరీశ్‌పై ఎమ్మెల్సీఅద్దంకి దయాకర్ మండిపాటు  

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రోజు ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్ధాంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాడని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. హరీశ్‌రావు పరిస్థితి శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ  ప్రజల సొమ్ము పేపర్ యాడ్స్ రూపంలో బీఆర్‌ఎస్ హయాంలోనే దుర్వినియోగం జరిగిందన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడు,  పంజాబ్, మహారాష్ట్ర ఎన్నికల్లో .. ఆ రాష్ట్రాల్లో ప్రకటనల పేరుతో ప్రభుత్వ సొ మ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసింది బీఆర్‌ఎస్ కాదా..? అని  నిలదీశారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించేందుకు మీడియా లో ప్రకటనలిస్తే హరీశ్‌రావుకు  కాంగ్రెస్‌పై ఇంత జలసీ ఎందుకని ప్రశ్నించారు.