నిజంగానే మెట్రోకు నష్టాలా?
21-05-2024 12:00 AM
హైదరాబాద్ మెట్రో ఇవాళ రాజధానికే మకుటాయమానం గా వుంది. నగర ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగానూ ఉంటున్నది. నిజానికి ఎప్పుడు చూసినా మెట్రో రైళ్లు బాగా రద్దీతోనే ప్రయాణిస్తున్నాయి. నష్టాల పేరుతో మెట్రోను అమ్మడానికో లేదా ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయాన్ని రాబట్టుకోవడానికో ‘ఎల్ అండ్ టీ’ ప్రయత్నిస్తున్నదని, ఆ ట్రాప్‌లో పడ వద్దంటూ ఆదివారం ‘విజయక్రాంతి’ మొదటిపేజీలో చైర్మన్ సి.ఎల్.రాజం ప్రత్యేక ‘సంపాదకీ యం’ ప్రజాప్రయోజనాల దృష్ట్యా విలువైంది. ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయానికి రావడం మంచిది.
ప్రవీణ్ కుమార్, తూంకుంట






