పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు తప్ప మరే రకమైన సప్లిమెంటరీ బిల్లులు, జిపిఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు నెలల తరబడి గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్నాయి. వైద్య అవసరాలు, గృహ నిర్మాణాలు, పిల్లల చదువు లు, వివాహాలకు, ఇతరత్రా అవసరాలకు పొదుపు చేసుకునే లో న్లు, నెలల తరబడి జాప్యం జరిగి సరైన సమయంలో సొమ్ము అం దక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్ కార్డులు కూడా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగులు తమ చేతినుండి లక్షల రూపాయలు నేరుగా చెల్లించి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారి మెడికల్ బిల్లుకూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. కొత్త ప్రభుత్వం అయినా పరిస్థితులు అర్థం చేసుకొని పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. నాలుగు కరువు భత్యాలనూ మంజూరు చేయాలి.
సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా






