కళ్ళకు కాటుక మంచిదేనా?
23-04-2024 12:05 AM
కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాటుక, ఐ లైనర్, మస్కారా వంటి వాటిని వేస్తుంటారు. అయితే అవి రసాయనాలతో తయారైనవి.. కాబట్టి కళ్ళకు వెయ్యడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాటుకను రోజూ వేసుకుంటే కలిగే సమస్యలేంటో చూద్దాం..
1 రసాయనాలతో తయారు చేసిన కాటుకను రోజూ వాడటం వల్ల కళ్ళకు దురద, మంటలు రావడం జరుగుతుంది.
2 కాటుకను ఎక్కువగా వాడితే దురద, వాపు, పొక్కులు అలర్జీ వంటివి కూడా వస్తాయి.
3 కాటుకను రోజూ వాడటం వల్ల కంటి రెప్పల వెంట్రుకలు ఊడిపోతాయి. కెమికల్స్ లేని కాటుకను వాడడం మంచిది.






