15 June, 2026 | 8:16 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బీసీలపై కేంద్ర ప్రభుత్వం వివక్షత?

10-05-2026 01:09 AM
  1. హామీ విస్మరించినందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు 
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మే 9(విజయక్రాంతి): జాతి జనగణలో సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర క్యాబినెట్‌లో నిర్ణయించి, నేడు జరుగుతున్న జనగణనలో చేయనందుకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే బీసీ డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీలు సంధించిన పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అఖిలపక్ష బీసీ సంఘాలు విజ్ఞప్తి చేసినప్పటికీ నేటి వరకు సమాధానం చెప్పకుండా బీసీలపై కేంద్రం వివక్షత చూపిస్తున్నదని ఆయన ఆరోపించారు.

ఆదివారం సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేస్తామని, జనాభా లెక్కలు బీసీ కులాలను లెక్కించి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రధానమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని జాజుల కోరారు. ప్రధానమంత్రి పర్యటనను స్వాగతిస్తున్నామని, ఇదే సమయంలో గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీ డిమాండ్లు నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్నందుకు నిరసనగా, బీసీల గోడు ప్రధాని నరేంద్ర మోదీ వినిపించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు చేపట్టాలని జాజుల పిలుపునిచ్చారు.