27 April, 2026 | 3:36 AM

కథా కార్యశాల విజయవంతం

27-04-2026 01:51 AM

టీఎస్‌ఎ సౌజన్యంతో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహణ

ఖమ్మం, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఖమ్మం జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీలలో ప్రముఖ కథకులు, సాహితీవేత్త నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో నిర్వహించిన ‘కథా కార్యశాల’ ఆదివారం విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ట్రస్మా అధ్యక్షులు గుర్రం కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ నెల 25 వ తేదీన ప్రా రంభమైన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి, ప్రముఖ కవి, విద్యావేత్త, వెమా కన్వీనర్ ము వ్వా శ్రీనివాసరావు ప్రారంభించారు. సృజనాత్మకంగా తమ స్వంత శైలిలో విద్యార్థులు కథలను ఎలా వ్రాయాలి అనే దానిపై నామి ని వివరించారు. విద్యార్థులకు వివిధ అంశాలపై కథా రచనల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభని కనబరిచారు.

ఉత్తమ రచనలు చేసిన విద్యార్థులకు అతిథులు బహుమతులు, ప్ర శంసా పత్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డాక్టర్ నామోజు బాలాచారి, ప్రొఫెసర్ పార్థ సారథి, ట్రస్మా రాష్ట్ర కన్వీనర్ ఐ.వి. రమణారావు, జాషువా సాహిత్య వేదిక సెక్రటరీ పగిడిపళ్లి వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా ట్ర స్మా కోశాధికారి నాసరయ్య, ఖమ్మం డివిజన్ ట్రస్మా అధ్యక్షులు జాఫర్ మతిన్, సెక్ర టరీ డాక్టర్ కె.సూరిబాబు, కోశాధికారి మో హనరెడ్డి, ఖమ్మం డివిజన్ ట్రస్మా అధ్యక్షులు టీవీ అప్పారావు, స్టేట్ అసోసియేటివ్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, ప్రైవేట్ జూనియర్ కాలే జ్ సంఘం బాధ్యులు వీరారెడ్డి, చల్లా శేషగిరి, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్‌లు రవి మారుత్, శివకృష్ణ, బీ సూర్యనారాయ ణ, డాక్టర్ చక్రధర్, జావేద్, చంద్రశేఖర్‌రావు, సీహెచ్ కార్తీక్, నానాజి, సదన్ లాల్, నవీన్, శ్రీనివాస్, రమేష్, ప్రదీప్, ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.