17 April, 2026 | 9:32 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలి:అచ్చంపేటలో సీపీఐ ధర్నా

11-06-2025 12:09 AM

అచ్చంపేట, జూన్ 10: రైతులకు ఎకరాకు రూ. 7,500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అచ్చంపేట తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి. గోపాల్, తాలూకా నాయకుడు ఎస్.మల్లేష్ మాట్లాడారు.

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షల సహాయం అందించాలని కోరారు. రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తు న ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డి. బాలచంద్ర య్య, గౌరయ్య, ఎన్. తిరుపతమ్మ, పెంటయ్య, వెన్నెల ఆనందు, ధర్మశీల, జంగయ్య, డి. లింగం, జై బక్కయ్య, శాంతమ్మ, కుమార్ తదితరులుపాల్గొన్నారు.