11-01-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్, ఓ మంత్రిని లక్ష్యంగా చేసుకుని ప్ర ముఖ తెలుగు న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై రాష్ట్ర అధికార యంత్రాంగం భగ్గుమన్నది. ఈ కథనం పూర్తిగా అసత్యమని, జర్నలిజం ముసుగులో మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం, తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీనిపై శనివారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి.
రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారికి, ఓ మంత్రికి లింక్ పెడు తూ ఆమెకు తక్కువ కాలంలోనే కీలకమైన, సౌకర్యవంతమైన పోస్టింగ్‌లు ఇచ్చారంటూ ఓ ప్రముఖ వార్తా ఛానల్ కథనాన్ని ప్రసా రం చేసింది. దీనిని మరికొన్ని సోషల్ మీడి యా హ్యాండిల్స్, వెబ్ సైట్లు అనుసరించాయి. ఈ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె రామకృష్ణారావు, కార్యదర్శి జయేశ్ రంజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో చిత్తశుద్ధి, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వర్తిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం నైతికంగా సరికాదన్నారు. ఇలాంటి చర్యలు నిజాయతీగా పనిచేసే సివిల్ సర్వీస్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుం డా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారహితమైన, అనైతిక జర్నలిజానికి దూరంగా ఉండాలని హితవు పలి కారు.
ఐఏఎస్ అధికారుల సంఘానికి తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడైన డీజీ పీ బి.శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు వండి వార్చ డం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీ నపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
సంబంధిత మీడియా సంస్థలు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉభయ సంఘాలు డి మాండ్ చేశాయి. అన్ని డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి ఆ అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించా లని స్పష్టం చేశాయి. పరువు నష్టం కలిగించేలా వ్యవహరించిన సంస్థలు, వ్యక్తు లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. మీడియా ట్రయల్స్, వదంతులను వార్తలుగా ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పాయి.