calender_icon.png 11 January, 2026 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

11-01-2026 12:00:00 AM

  1. ఇద్దరిని అదులోకి తీసుకున్న కాజీపేట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 
  2. కిడ్నాప్‌నకు గురైన ఐదుగురు చిన్నారుల గుర్తింపు
  3. నిందితుల నుంచి పిల్లలను కొన్న దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హనుమకొండ, జనవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా సభ్యులను హనుమకొండ జిల్లా కాజీపేట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారకు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 28న తెల్లవారు జామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నానాయక్ కుమారుడైన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు.

కన్నానాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు దర్యా ప్తు చేపట్టారు. అయితే కాజీపేట రైల్వే స్టేషన్ వద్దనే మళ్లీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన కొడుపాక నరేష్, వేల్పుల యాదగిరిలను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారి ని విచారించగా కన్నానాయక్ కుమారుడ్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు.

ఆ బాలు డ్ని జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రా మంలో విక్రయించినట్లు చెప్పారు. అలాగే గతంలో కిడ్నాప్ చేసిన నలుగురు పిల్లలను మంచిర్యాల జిల్లా నస్పూర్, జన్నారం, మం చిర్యాల, జగిత్యాల జిల్లాలో విక్రయించినట్లుగా ఒప్పుకున్నారు. దీంతో ఆ నలుగురు పిల్లలను కూడా పోలీసులు రక్షించారు. ఎ లాంటి చట్టబద్ధ ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులో కి తీసుకున్నారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారు లు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులను అందజేసారు. ఈ సమావేశంలో డీసీ పీ ధార కవిత, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.