23 June, 2026 | 11:23 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

రాజ్యాంగాన్ని రక్షించడమంటే ఇదేనా?

14-03-2026 02:03 AM
  1. మాటలతో కాదు, ఆచరణలో కూడా కాపాడాలి
  2. రాహుల్‌గాంధీకి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిర క్షణ కోసం పోరాడుతున్నామని కాంగ్రెస్ చెబుతుండగా, తెలంగాణలో మాత్రం ఆచరణలో పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగాన్ని రక్షించడమంటే ఇదేనా?, మీరు బోధించే రాజ్యాంగ నైతికత ఇదేనా అని మాజీ మంత్రి హరీశ్‌రా వు ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ఈ మేరకు శుక్రవారం బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ మాటలకు పూర్తి విరు ద్ధంగా ఉన్నాయన్నారు.

దానం నాగేందర్ బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలి చి, తరువాత కాంగ్రెస్ ఇచ్చిన అధికారిక బీ-ఫారమ్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. ఇది ప్రజా రికార్డులో ఉన్న స్పష్టమైన విషయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్పీకర్ ఫిరాయింపునకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం ఆశ్చర్యకరమని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ శాసనసభ పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తాను ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాసి ఈ అంశం పై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం ఫిరాయింపులను కాపాడుతున్నట్లు కనిపి స్తోందని విమర్శించారు. దానం నాగేందర్‌పై ఫిరాయింపు నిరోధక చట్టం కింద తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం, స్పీకర్‌కు సూచిస్తారా? అని రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆచరణలో కూడా కాపాడాలని లేఖలో పేర్కొన్నారు.