ఇస్రో ప్రయోగం విఫలం
-మూడో దశలో విఫలమైన పీఎస్‌ఎల్‌వీ
-నాజల్ విఫలమవడమే కారణం!
శ్రీహరికోట, మే 18: భారత అంతరిక్ష పరి శోధన సంస్థ (ఇస్రో) ప్రయోగాత్మకంగా చేపట్టి న 101వ ప్రయోగం విఫలమైంది. ఆదివారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్ వీ 61 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) మొదటి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసింది.
కానీ మూడో దశకు వచ్చేసరికి రాకెట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి ప్రయోగం విఫలమైంది. ప్రయోగ సమయంలో పీఎస్3 సాలిడ్ మోటార్ ఫేజ్‌లో సమస్యలు తలెత్తా యి. టెలిమెట్రీ చాంబర్ ప్రెజర్‌లో అకస్మా త్తుగా తగ్గుదల కనిపించింది.
ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ సిస్టమ్, రాకెట్ థ్రస్ట్‌ని నియంత్రించే ఈ రాకెట్ ద్వారా అధునాతన ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను నింగిలోకి పంపా రు. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫొటోలు తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2022లో ప్రయోగించిన ఈఓఎస్ ఉపగ్రహానికి ప్రత్యామ్నా యంగా ఈ ఉపగ్రహాన్ని పంపేందుకు యత్నించారు.




