18-05-2025 01:05:45 PM
హైదరాబాద్: చార్మినార్(Charminar) పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House) అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామని ప్రధాని మోడి తెలిపారు.
ఏపీ సీఎం దిగ్భ్రాంతి..
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు(AP CM Nara Chandrababu) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తెలిపారు.