17 May, 2026 | 9:59 PM

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పెంపుపై ఉత్తర్వులు జారీ

20-06-2024 01:05 AM

హైదరాబాద్,  జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు) కాలపరిమితిని సెప్టెంబర్ 30 వరకు పెంచారు.  రాష్ట్రసమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాస్థాయిలో అక్రిడే షన్ కమిటీ చైర్మన్లు, కలెక్టర్లు ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రెండేళ్లకోసారి జారీ చేసే ఈ కార్డుల కాలపరిమితి ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.