నోటిఫికేషన్లు విడుదల చేయండి
- గ్రూప్స్, మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలి
- నిరుద్యోగ జేఏసీ డిమాండ్
- ఆర్టీసీ క్రాస్రోడ్ వద్ద నిరుద్యోగులతో ధర్నా
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్రోడ్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ టెస్టు సిరీస్‌కు వచ్చిన అభ్యర్థులు కూడా ధర్నాకు మద్దతుగా పాల్గొన్నారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు వయోపరిమితిని సడలించాలని, గ్రూప్స్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్ నాయక్, నరేష్, రవి నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హా మీలను అమలు చేసి, ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగే ధర్నాల గురించి మాట్లాడే రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ని నిరుద్యోగుల సమస్యలు, వారి బాధలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిం చారు.
ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించా రు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కార్యక్రమంలో కిరణ్, కుమార్, బాలకోటి, శ్రీకాంత్, ప్రవీణ్, మధుశ్రీ, పల్లవి, గీత, దీపిక, రామకృష్ణ, రాజేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.






