10 August, 2026 | 3:46 AM

ఉద్యోగుల హక్కులకు ఉద్యమ కార్యాచరణ

10-08-2026 01:02 AM

ఐపీఎస్‌ఈఎఫ్ సమావేశంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లతో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో ఉద్యమ కార్యాచరణను చేపట్టనున్నట్లు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ తెలిపారు. ఇందుకు ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో యూనివర్సిటీ కమ్యూనిటీ హాల్‌లో ఇండియన్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐపీఎస్‌ఈఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కే.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడు.. తక్షణమే ఎన్‌పీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, నూతన పే రివిజన్ కమిషన్ అమలు చేయాలని కోరారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.