ఒంగోలులో ఇసుజు మోటార్స్ కొత్త 3ఎస్ డీలర్ షిప్
ఒంగోల్ ఏప్రిల్ 26, 2026: ఆంద్రప్రదేశ్ లో తన ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో ఇసుజు మోటార్స్ ఇండియా ఒంగోలులో ఒక కొత్త 3ఎస్ (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) ను ప్రారంభించింది. ఆర్కేఈ ఇసుజు ద్వారా నిర్వహించబడే ఈ కేంద్రం వినియోగదారులకు నిరంతర మరియు ఉన్నతమైన సర్వీసును అందించనుంది. ఈ కేంద్రాన్ని డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇసుజు మోటార్స్ ఇండియా తకేషి హిరానో మరియు ఆర్కేఈ ఇసుజు అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఇసుజు ఇప్పుడు ఆంధ్రప్రదేస్ లో 9 టచ్పాయింట్స్ మరియు ఇండియాలో 108 టచ్పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలులో ఈ కొత్త 3ఎస్ కేంద్రము ప్రారంభముతో ఆంధ్రప్రదేశ్ లో తమ ఉనికిని బలోపేతం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ తకేషి హిరానో చెప్పారు. ఇటువంటి విస్తరణల ద్వారా వినియోగదారులకు మెరుగైన నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్కేఈ ఇసుజు తో తమకు దీర్ఘ-కాలిక భాగస్వామ్యం ఉందన్నారు.
ఇదిలా ఉంటే ఒంగోలులో ఈ కొత్త 3ఎస్ కేంద్రము ప్రారంభించడం ద్వారా ఇసుజు మోటార్స్ ఇండియాతో తమ అనుబంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉందని ఆర్కేఈ ఇసుజు డీలర్ ప్రిన్సిపల్
జి. బాలాజి చౌదరి చెప్పారు. తిరుపతి ,నెల్లూరులో ఉన్న తమ ప్రస్తుత టచ్పాయింట్స్ కు ఒక చేరికగా, ఈ కేంద్రము నిరంతర అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని ఇవ్వబడానికి ఏర్పాటు చేయబడిందన్నారు. ఆర్కే గ్రూప్ లో భాగమైన ఆర్కేఈ ఇసుజుకు ఆటోమోటివ్ రంగములో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఇసుజు మోటార్స్ ఇండియాకు ఇది సుదీర్ఘ భాగస్వామి. ఈ కొత్త కేంద్రములో టు-పోస్ట్ లిఫ్ట్ , అంకితభావం కలిగిన వాషింగ్ బే సహా నాలుగు సర్వీస్ బేస్ ఉన్నాయి. సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ యొక్క ఆవశ్యకతలను నెరవేర్చుటకు ఏర్పాటు చేయబడిన ఈ డీలర్ షిప్ వినియోగదారులకు సమగ్రమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు






