27 June, 2026 | 2:44 AM

జర్నలిస్టు గండమల్ల ఉపేందర్ అకాల మృతి

27-06-2026 01:56 AM

పాడెమోసిన జర్నలిస్టులు

తిరుమలాయపాలెం, జూన్ 26 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసిన పాత్రికేయుడు, తిరుమలాయపాలెం మండల ప్రెస్ క్లబ్ సభ్యుడు గండమల్ల ఉపేందర్ గుండెపోటుతో [అకాల] మరణం పాత్రికేయ లోకాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తుదిశ్వాస విడిచారు.

ఉపేందర్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి పాత్రికేయులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పాత్రికేయులు కూరపాటి విజయకుమార్, గుజ్జ రామకృష్ణ,  ఎలిమల్ల శ్రీనివాస్, కామల్ల వీరయ్య, కొండా ఉపేందర్, నాగరాజు, కూరపాటి ఉపేందర్, మెట్టు రుద్రరాజు తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.