13 April, 2026 | 1:38 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

నేను వెళ్లేసరికే చనిపోయింది

27-08-2024 01:54 AM
  1. కోల్‌కతా హత్యాచారం కేసులో నిందితుడి వాంగ్మూలం
  2. పాలిగ్రాఫ్ టెస్టులో పొంతన లేని సమాధానాలు
  3. అదే రోజు మరో యువతిపై లైంగిక వేధింపులు
  4. స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియాలో చక్కర్లు
  5. సంజయ్ ఫోన్‌లోనూ పెద్ద ఎత్తున అశ్లీల వీడియోలు
  6. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూస్తోన్న సంచనల విషయాలు

కోల్‌కతా, ఆగస్టు 26: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్‌రాయ్ సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలను వెల్లడించాడు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంజయ్‌కు కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు శనివారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో పొంతన లేని, తప్పుడు సమధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను అధికా రులు బయటికి చెప్పకపోయినా విశ్వసనీయ వర్గాల ద్వారా పలు అంశాలు బయటికి వచ్చాయి.

ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని చెప్పాడని, అక్కడికి వెళ్లే సమయానికి వైద్యురాలు అప్పటికే చనిపోయిందని చెప్పినట్లు సమాచారం. అది చూసి భయంతో పారిపోయినట్లు లై డిటెక్టర్ టెస్టులో సంజయ్ తెలిపినట్లు తెలుస్తోంది. అయితే, అత్యాచారం, హత్య జరిగిన రాత్రి సంజయ్ ఏమేం చేశాడో దర్యాప్తులో వివరించినట్లు సమాచారం. అదే రోజు మరో యువతిపై తన స్నేహితుడితో కలిసి లైంగికదాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

మరో యువతిపై దాడి

ఆగస్టు 8న ఆర్జీ కర్ ఆసుపత్రిలో చేరిన తన స్నేహితుడి సోదరుడి పరిస్థితిని తెలుసుకునేందుకు అతనితో కలిసి సంజయ్ అక్కడి కి వెళ్లాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి సుమారు రాత్రి 11.15 గంటలకు ఇద్దరు కలిసి మద్యం సేవించారు. తర్వాత ఉత్తర కోల్‌కతాలోని సోనాగచ్చిలో రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ అనుకున్న పని నెరవేరకపోవడంతో దక్షిణ కోల్‌కతాలోని చెట్లా ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దారిలో రోడ్‌పైన వెళుతున్న ఓ అమ్మాయిని లైంగికంగా వేధించా రు. ఆ తర్వాత చెట్లాలో తన స్నేహితుడు ఓ మహిళతో ఉండగా.. సంజయ్ బయట ఉండి తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడి తనకు అశ్లీల చిత్రాలు పంపాలని అడగగా ఆమె పంపింది. తిరిగి ఇద్దరు ఆసుపత్రికి వచ్చారు. సంజయ్ నాలుగో అంతస్థులోని ట్రామా సెంటర్‌కు వెళ్లాడు. 

ఫోన్‌లో అశ్లీల వీడియోలు

ఆగస్టు 9 ఉదయం 4.03 గంటలకు మూడో అంతస్థులోని సెమినార్ దగ్గర ఉన్న కారిడార్‌కు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. అనంతరం బాధితురాలు నిద్రిస్తున్న సెమినార్ హాల్‌లోకి రాయ్ ప్రవేశించాడు. అక్కడే బాధితురాలిపై లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపాడు. తర్వాత తన స్నేహితుడు, పోలీసు అధికారి అనుపమ్ దత్తా ఇంటికి వెళ్లాడు. ఈ ప్రదేశాల్లో సంజయ్‌తో పాటు అతని స్నేహితుడు ఉన్నట్లు వారి కాల్ డాటా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి.

అంతేకా కుండా సంజయ్ ఫోన్‌లో ఎక్కువ మొత్తం లో అశ్లీల వీడియోలు, చిత్రాలు ఉన్నట్లు చెప్పాయి. ఇందులో తోబుట్టువుల మధ్య లైంగిక చర్యను వర్ణించే వీడియోలు సైతం ఉన్నాయని గుర్తించారు. దీన్ని బట్టి సంజయ్ మానసిక పరిస్థితిని అంచనా వేసిన సీబీఐ ఆదివారం కూడా లై డిటెక్టర్ టెస్టును నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది లేకపోవడం చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తున్నారో తనకు సమాచారం ఇవ్వలేదని, ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపించారు. 

నిజం ఒప్పుకుని ఆ తర్వాత..

ఇదిలా ఉండగా ట్రైనీ డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడినట్లు అంతకుముందు కోల్‌కతా పోలీసుల ఎదుట సంజయ్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి చెందిన వైద్య బృందం అతని మానసిక తీరును విశ్లేషించిన సమయంలో ఘటన జరిగిన రోజు ఏమేం జరిగాయో పూర్తిగా ఒక ఎపిసోడ్‌లాగా వివరించాడని తెలుస్తోంది. కాగా, ఆ సమయంలో అతనిలో పశ్చాత్తాపమే లేనట్లు కనిపించిందని కేసు దర్యాప్తు చేస్తోన్న ఓ అధికారి చెప్పినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అనంతరం కోర్టులో హాజరు పరచగా తానే తప్పు చేయలేదని, కావాలనే తనను ఇరికిస్తున్నారని న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.