అసలేం జరిగింది?
న్యూఢిల్లీ, ఆగస్టు ౨౭: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ పిళ్లు వాంగ్మూలాన్ని సీబీఐ సేకరించింది. ఇందులో కవిత కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. దీంతో కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. మద్యం టెండర్లలో రూ. కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. పిళ్లు రిమాండ్ నివేదికలో అత డిని కవిత బినామీగా ఈడీ పేర్కొంది. వీరి నుంచి రూ.100 కోట్లు ఆమ్‌ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో అందాయని ఆరోపించింది.
ఈ మేరకు గతేడాది మార్చిలో కవితకు నోటీసులు జారీ చేసి విచారించింది. ఆ తర్వాత కూడా విచారణకు హాజరు కావాలని పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు మహిళల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్ర యించి కవిత ఉపశమనం పొందారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేసిన ట్టు ఈడీ ప్రకటించింది. ఆ రోజు ఆమె ఇంటి కి వెళ్లి సోదాలు నిర్వహించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమెకు చెందిన 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అనంతరం తీహార్ జైలుకు తరలించారు.
నేడు హైదరాబాద్‌కు..
ఎమ్మెల్సీ కవిత తీహార్‌జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఆమెను విడుదల చేసేందుకు రౌస్ అవెన్యూ కోర్టుకు సుప్రీం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. కవిత భర్త, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ష్యూరిటీ పత్రాలు సమర్పించారు. రూ.10 లక్షల పూచీకత్తు బాండ్లను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ జారీ చేసింది. జైలు నుంచి కవిత మంగళవారమే విడుదలైనా బుధవారం మధ్యా హ్నం 2.45 గంటలకు హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.




