15-11-2025 12:28:58 AM
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా శుక్రవారం విడుదలైంది. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం తమ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కనిపిస్తోందంటూ మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం పాల్గొన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చూసి మేము ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం పడిన కష్టం మర్చిపోయాం. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మూవీ చేశాం. ఆ ఫలితం మాకు దక్కిందని అనిపిస్తోంది” అన్నారు. హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. “మా మూవీ హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ ఆదరణ ఇలాగే కంటిన్యూ అయితే మేము కంప్లీట్ గా సక్సెస్ అయినట్లే” అని చెప్పారు.
డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఒక సోషల్ ఇష్యూ చుట్టూ ఎంటర్ టైన్‌మెంట్ ఫిల్ చేసి ఎంగేజ్ చేసేలా సినిమా చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి” అని తెలిపారు. నిర్మాత శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఒక ఎంటర్‌టైనింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా సినిమా సక్సెస్‌తో అర్థమైంది. సినిమాకు ఎంత పర్పెక్ట్‌గా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే ఔట్ పుట్ అంత బాగా వస్తుందని మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ మరోసారి నిరూపిం చింది” అన్నారు. టీమ్ పాల్గొన్నారు.