15-11-2025 12:29:58 AM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెటి ఓ శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం చిత్రబృందం ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేదికపై ‘తాండవం’ అనే పాటను విడుదల చేశారు. ‘హే ఖండ ఖండ ఖండిత.. దండ యోగ మండిత.. చండ బాహు రుద్ర మాల చండిత.. హే ధర్మలోక రక్షిత.. సుప్రభాత వీక్షిత.. భూనభోంతరాల సర్వ రక్షిత.. రంగ రంగ శంభులింగ ఈశ్వర.. అంతరంగ హే భుజంగ శంకర.. హే నీలకంఠ నిర్మలంగ ఈశ్వర..’ అంటూ సాగుతోందీ గీతం.
తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ పాటలో ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో డమరుకంతో తాండవం చేస్తూ ఆకట్టుకున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: సీ రాంప్రసాద్, సంతోష్; ఫైట్స్: రామ్ లక్ష్మణ్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; సమర్పణ: ఎం తేజస్విని నందమూరి; నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట; రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను.