calender_icon.png 15 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ ఎంట్రీల గడువు పెంపు

15-11-2025 12:27:33 AM

తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ (హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ 2025) జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో కొనసాగనున్న ఈ వేడుకలో భాగంగా నిర్వహించే పోటీలకు ఔత్సాహికుల నుంచి ఎంట్రీలను ఆహ్వానించారు.

పోటీదారుల రిజిస్ట్రేషన్‌కు నవంబర్ 20 ఆఖరు తేదీగా నిర్ణయించారు. అయితే, దరఖాస్తుల చివరి తేదీని నవంబర్ 26 వరకు పొడిగించినట్టు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు శుక్రవారం తెలిపారు.  అన్ని ఎంట్రీలను ఫిల్మ్‌ఫ్రీవే లేదా అధికారిక HISFF వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలని ఆయన కోరారు.