calender_icon.png 18 June, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు శాఖలో పనిచేసే అవకాశం కలగడం గర్వకారణం

31-05-2025 05:08:36 PM

జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖలో పనిచేయుటకు అవకాశం కలిగి ప్రజలకు సేవ చేయడం ఎంతో గర్వకారణం అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు విధులు నిర్వర్తిస్తూ శనివారం పదవి విరమణ పొందుతున్న పోలీసు అధికారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించి మాట్లాడారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయం అని అన్నారు.

మీ యొక్క సేవలు, అనుభవాలు పోలీస్ శాఖకు చాలా అవసరం ఉంటాయని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం అని, పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు. పదవి విరమణ పొందిన అనంతరం కూడా పోలీసు కుటుంబ సభ్యులేనని, ఏలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. అనంతరం వారికీ అందవలసిన ఆర్దిక సదుపాయాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ శ్రీనివాసులు, ఆర్.ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.