calender_icon.png 6 December, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలి

06-12-2025 12:33:52 AM

జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి

 గోపాలపేట, డిసెంబర్5: మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలనీ జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ఆదేశించారు.  శుక్రవారం జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మొదటి విడత ఎన్నికలు జరిగే గోపాల్పేట మండలాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. తుది జాబితాలో నిలిచిన పోటీ చేసే అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులను తెలియచేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

8వ తేదీన పోలింగ్ సిబ్బందికి  మండల కార్యాలయాల్లో  నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓ కు అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే పోలింగ్ సిబ్బంది నుండి ఫారం 17, డ్యూటీ ఆర్డర్ కాపీ చూసి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి సంతకం ఉండాలని లేనిపక్షంలో ఓటు చెల్లదన్నారు. సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పోస్ట్ చేశారాఎంతమంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని పరిశీలించారు. 

సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తే ఓటరు జాబితాలో పోస్టల్ బ్యాలెట్ జారీచేసినట్లు మార్క్ చేశారా లేదా అని తనిఖీ చేశారు. డిసెంబర్ 11న నిర్వహించనున్న ఎన్నికల ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన వసతులు, పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, రూట్ వారిగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అప్రమత్తం చేశారు. ఎన్నికలు పూర్తి అయి ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎంపిక, తిరిగి బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ సెంటర్ లో అప్పగించే వరకు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలోఎంపీడీవో, ఆయేషా అంజుం, తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీఓ కలెక్టర్ వెంట ఉన్నారు.