అది ఆశీర్వాదానికి ప్రతీక
10-12-2024 02:22 AM
- విగ్రహం చేతిని పార్టీ గుర్తుగా చూడొద్దు
- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం చేతిని ఒక పార్టీ గుర్తుగా చూడొద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అసెం బ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పా టుపై ఆయన మా ట్లాడారు. విగ్రహంలోని చేయి.. హస్తం గుర్తు కాదని, ఆశీర్వాదానికి ప్రతీక అని తెలిపారు.
- విగ్రహ రూపాన్ని పార్టీలకు ఆపాదించొద్దని సూచించారు. డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యం ఉందని.. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేయా లని ఆనాడు ఎంపీలందరూ ఆమెను కోరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.






