బడుల్లో టీచర్ల ఫొటోలు డిస్‌ప్లేలో పెట్టాలి
10-12-2024 02:24 AM
* పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో పని చేసే ఉపాధ్యాయుల వివరాలతో కూడిన ఫొటోలను అందరికీ కనిపించేలా పెట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూ ళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యాధికారులను ఆదేశిం చారు. అన్ని పాఠశాలల్లో వంద శా తం అమలయ్యేలా డీఈవోలు, ఎం ఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఉత్తర్వుల్లో తెలిపారు. కొంత మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా వారి స్థానంలో వలంటీర్లను పెట్టడంతోపాటు ఇటీవల కొందరు బదిలీ అయ్యారన్నారు. అందువల్ల టీచర్ల వివరాలు తెలిసేలా ఫొటోల ను డిస్‌ప్లేలో పెట్టాలని సూచించారు.






