విజయోత్సవాల పేరిట ప్రజాధనం దుర్వినియోగం
*బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ప్రజాధనాన్ని కాంగ్రె స్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. లేజర్, డ్రోన్, ఎయిర్ షోలు.. మ్యూజికల్ నైట్స్ ప్రోగ్రాంల పేరిటవృథాగా డబ్బులు ఖర్చు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. ప్రజలకు ఏం ఒరగబెట్టారనేది చెప్పకుండా.. వారి కి తోచినట్టు ఉత్సవాలు చేసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కీర్తిని దిగజార్చేలా ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి వక్రభాష్యాన్ని చెబుతోందని విమర్శించారు. తల్లిని, దేవతను వేర్వేరుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.






