రజనీ శాసించాడు.. కావ్య పాటించింది
‘మంచి ఆటగాళ్లను తీసుకోండి.. కావ్య బాధపడటం చూడలేకపోతున్నా’ అని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహాలను పక్కాగా పాటించిన రైజర్స్.. మినీ వేలంలో ఆచితూచి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిన స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను 20 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసుకుంది. ఇక కంగారూ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను మాత్రం తక్కువలోనే కొట్టేసింది. మార్క్మ్ మీద నుంచి కెప్టెన్సీ భారం తొలగించి సారథ్య బాధ్యతలు కమిన్స్‌కు అప్పచెప్పగా.. అతడు కూడా దంచికొడుతున్నాడు. ఇక సిక్సర్లు తప్ప బౌండ్రీలు వద్దే వద్దు అన్నట్లు చెలరేగుతున్న క్లాసెన్.. ఈ సీజన్‌లో రైజర్స్‌కు ట్రంప్ కార్డ్‌లా మారాడు. ఫలితంగా సన్‌రైజర్స్ లీగ్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించగా.. డగౌట్‌లో రైజర్స్ యజమాని కావ్య ఆనందంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో హైదరాబాద్ వరుస ఓటములు పాలవుతున్న సమయంలో రజనీ.. కావ్యకు మంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.






