12 May, 2026 | 1:23 AM

రేణుక నియామకాన్ని వ్యతిరేకించడం తగదు

12-05-2026 12:00 AM

అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంచాల

ముషీరాబాద్, మే 11 (విజయక్రాంతి): వడ్డెర కో -ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల గుంజ రేణుక నారాయణను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం హర్షనీయమని, కానీ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రేణు క నియమకాన్ని వ్యతరేకించడం తగదని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంచాల అ న్నారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వడ్డెర కో -ఆపరేటివ్ కార్పొరేషన్ నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో వడ్డెర ఫెడరేషన్‌కు ఎం దుకు నిధులు కేటాయించలేదని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్‌ను ఎందుకు నియ మించలేదని ప్రశ్నించారు. విమర్శలు మానుకొని, అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. సమావేశంలో సంఘం నేతలు కుంచపు రామ, రాపెన్ గిరిబాబు, ఎం. హనుమంతు, డి. కృష్ణ, ఎ.వెంకటేష్, కె. బ్రహ్మయ్య పాల్గొన్నారు.