టీఆర్పీలో భారీగా చేరికలు
ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు, యువకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరగా, మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మా ట్లాడుతూ.. దశాబ్దాలుగా బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించబడుతున్నారని, కానీ అధికారంలో భాగస్వా మ్యం మాత్రం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు అన్నింటిలోనూ బీసీలకు న్యాయం జరగకుండా అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి వ్యవస్థను తమ చేతుల్లోనే ఉంచుకున్నాయని విమర్శించారు.
బీసీలు ఐక్యంగా ఉంటే ఎవరూ ఆపలేరని, 2029 నాటికి బీసీలు అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం సాధ్యమని, ప్రతి బీసీ కుటుంబం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.






