11 August, 2026 | 1:23 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఆ వ్యవస్థను ప్రోత్సహించేది మగవాళ్లే!

19-06-2025 12:17 AM

హీరోయిన్‌గానే కాక సహాయక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందింది నటి ఎస్తేర్ నోరోన్హా. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. కాకపోతే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో తర్వాత ఛాన్సులు తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. అన్నీ అనూహ్యంగా వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు చిన్నచిన్న సినిమాలు చేస్తూ ఎస్తేర్ నోరోన్హా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

తాజాగా ‘ది వేకెంట్ హౌస్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. “సమాజంలో వేశ్యలను చాలా చులకనగా చూస్తుంటారు. వేశ్య వృత్తిలోకి ఎవ్వరూ ఇష్టంతో రారు. ఆర్థిక పరిస్థితులు కారణంగా అలా మారుతారు. మగవాళ్లు వేశ్యల దగ్గర వెళ్లి.. కోరికలు తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి వచ్చేయొచ్చుగా?! కానీ, అలా చేయరు.

వేశ్యలు సమాజంలో ఉన్నారంటే.. వారిని వాడుకునేవారు కూడా ఉన్నారనేగా అర్థం! మగవాళ్లు.. దగ్గరకు వెళ్లకపోతే వేశ్యలు ఉండేవారు కాదేమో. అంటే ఈ వ్యవస్థను ప్రోత్సహించేది మగవాళ్లే అన్నమాట” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.