calender_icon.png 10 February, 2026 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులను మోసం చేయడం సరికాదు

10-02-2026 12:06:21 AM

  1. వారి రిటర్డ్మెంట్ డబ్బులను వారికి ఇవ్వకుంటే ఎట్లా?
  2. హామీ పత్రాలు కాదు పైసలు ఇవ్వండి 
  3. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్టం కోసం ముందుండి పోరాటం చేశారని, ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.

చనిపోయిన విశ్రాంత ఉద్యోగులకు వారికీ రావాల్సిన ఆర్థికపరమైన సహాయం ప్రభుత్వం ఇవ్వడం లేదని,డీ ఏ లు కూడా ఇవ్వడం లేదని, ఐదు డీ ఏ లు పెండింగ్ ఉన్న రాష్టం తెలంగాణ ఒక్కటే అన్నారు. జిఓ 317 ప్రభుత్వ ఉత్తరువులపై సమీక్షించి భార్య భర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా చేస్తామని మాట తప్పారన్నారు.  బదిలీలలు క్యాలెండరు ఇస్తామని చెప్పారని,..జర్నలిస్ట్..ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మాట తప్పారన్నారు.

వెల్నెస్ కేంద్రాలలో కూడా మందులు అందుబాటులో ఉంచడం లేదని, జి పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దాచుకున్న డబ్బులు రాక గుండెపోటుతో పలువురు మృతి చెందరని,ఇవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. ఎన్నికలప్పుడు గొప్పగా మాట్లాడిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం లేదని పేర్కొన్నారు.

ఉద్యోగులకు ఏ రాష్టంలో లేని విధంగా ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చామన్నారు. కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి ఇవ్వడం లేదని, సిపిఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఒకటవ  తేదీ జీతం ఇచ్చామని చెబుతున్న నాయకులు ఇతర సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాల ఖర్చులు ఇవ్వడం లేదని, జి పిఎఫ్ డబ్బులు ఇవ్వడానికి కూడా 20 శాతం డబ్బులు అడుగుతున్నారన్నారు. విశ్రాంత ఉద్యోగులు..ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరు నమ్మే వారు..వెంటనే లోన్లు ..చేతి బదులు ఇచ్చేవారని.ప్రభుత్వ తీరుతో ఇప్పుడు వారిని నమ్మడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు చంద్రయ్య, శివాజీ గౌడ్, రాములు, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, రమేష్, దానం సుధాకర్, తదితరులు ఉన్నారు.