calender_icon.png 6 October, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడం మా కర్తవ్యం

06-10-2025 12:00:00 AM

- వీల్ చైర్, స్ట్రక్చర్ ఏర్పాటు, లిఫ్ట్ రిపేర్ పూర్తి

- విజయక్రాంతి వార్తా కథనానికి స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి

 నాగర్ కర్నూల్ అక్టోబర్ 5 ( విజయక్రాంతి )నిరుపేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అం దించాలన్న లక్ష్యంతోనే నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రి వైద్య బృందం నిర్విరామంగా పనిచేస్తుందని చిన్నచిన్న స మస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉ షారాణి, ఆర్తో హెచ్‌ఓడి ప్రొఫెసర్ శేఖర్ తెలిపారు.

ఈనెల 4న ‘జనరల్ ఆస్పత్రిలో రోగుల అవస్థలు ‘ శీర్షికన విజయక్రాంతిలో వెలువడిన వార్త కథనానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. జనరల్ ఆస్పత్రిలో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అందుకు గల కారణాలను కోరుతూ నివేదిక కోరినట్లు తెలిసింది.

ఈ నేపద్యంలో ఆదివారం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద రోగులకు అందుబాటులో వీల్ చైర్, స్ట్రక్చ ర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రెండవ అంతస్తులో ఉన్న సాధారణ వార్డుకు రోగులు వచ్చి వెళ్లేందుకు లిఫ్టు పనిచేయక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ప్రస్తావించడంతో వెంటనే లిఫ్ట్ మరమ్మత్తు పనులను కూడా పూర్తి చేయడంతో రోగులు వారి బంధువులు ఆసుపత్రి వైద్య బృందానికి వార్తా కథనాన్ని ప్రచురించిన విజయక్రాంతికి కృతజ్ఞతలుతెలిపారు.